Abn logo
Mar 30 2020 @ 04:32AM

రాకెట్లు కాదు.. వెంటిలేటర్ల డిజైన్‌!

  • కేరళలోని ఇస్రో కేంద్రం అధికారుల వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 29: కేరళలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ).. ఇస్రోలో భాగమైన ఈ కేంద్రంలో సాధారణంగా రాకెట్లు తయారు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు వాటి తయారీని ఆపి వెంటిలేటర్లు, శానిటైజర్లు, ఆక్సిజన్‌ క్యాన్ల తయారీపై దృష్టి పెడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా వీఎ్‌సఎ్‌ససీలో తాత్కాలికంగా రాకెట్‌ తయారీని నిలిపివేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ‘‘ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్ల కంటే భిన్నమైన వాటిని డిజైన్‌ చేస్తున్నాం. సులభంగా, విద్యుత్తు లేకపోయినా పనిచేసే వెంటిలేటర్లను డిజైన్‌ చేస్తున్నాం’’ అని వీఎ్‌సఎ్‌ససీ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. తాము డిజైన్‌ మాత్రమే చేస్తామని, తయారీ బాధ్యత పరిశ్రమలదేనని చెప్పారు. వీఎ్‌సఎ్‌ససీ సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారన్నారు. మరోవైపు 1000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేశామని, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మాస్కులు కూడా తయారు చేస్తున్నారని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement