రాకెట్‌ రెడీ

ABN , First Publish Date - 2022-06-25T07:00:29+05:30 IST

షార్‌ నుంచి ఈ నెల 30వ తేదీ ప్రయోగించేందుకు పీఎస్‌ఎల్వీ-సీ53 రాకెట్‌ సిద్ధమైంది.

రాకెట్‌ రెడీ
రెండవ ప్రయోగ వేదికపై సిద్ధమైన పీఎస్‌ఎల్వీ-సీ53

షార్‌ నుంచి ఈ నెల 30వ తేదీ  ప్రయోగించేందుకు పీఎస్‌ఎల్వీ-సీ53 రాకెట్‌ సిద్ధమైంది. 44.4 మీటర్ల పొడవుతో ఉండే నాలుగు దశల ఈ రాకెట్‌ను షార్‌లోని వాహన అనుసంధాన భవనంలో అంచలంచెలుగా అనుసంధానిం చారు.ఈ రాకెట్‌ ద్వారా కక్ష్యల్లోకి చేరవేసే మూడు ఉపగ్రహాలను షార్‌ క్లీన్‌ రూములో తుది పరీక్షలు చేసి రాకెట్‌ అగ్రభాగాన ప్రత్యేక అడాప్టర్‌పై అమర్చి ఉష్ణకవచంతో మూసివేశారు.షార్‌ రెండవ ప్రయోగవేధికపై పీఎస్‌ఎల్వీ-సీ53 రాకెట్‌ సిద్ధమైంది.ఈ రాకెట్‌కు తుది పరీక్షలు నిర్వహించి 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రయోగ కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు.25 గంటలపాటు కౌంట్‌డౌన్‌ కొనసాగించి 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు సింగపూర్‌కు చెందిన డీఎస్‌-ఈవో, ఎన్‌ఈయూఎస్‌ఏఆర్‌ స్కూబ్‌-1తో ఈ రాకెట్‌ రోదసిలోకి దూసుకుపోనుంది. 

-శ్రీహరికోట (సూళ్లూరుపేట)




Updated Date - 2022-06-25T07:00:29+05:30 IST