పరీక్షలోనే పేలుడు

ABN , First Publish Date - 2020-05-31T08:36:06+05:30 IST

స్పేస్‌ఎక్స్‌ మరో స్టార్‌షిప్‌ రాకెట్‌ నమూనాను కోల్పోయిం ది. దక్షిణ టెక్స్‌సలో కంపెనీకి చెందిన పరీక్షా కేంద్రంలో శుక్రవారం నవతరం స్టార్‌షిప్‌ రాకెట్‌ నాలుగో నమూనాను...

పరీక్షలోనే పేలుడు

  • మరో స్టార్‌షిప్‌ రాకెట్‌ నమూనాను కోల్పోయిన స్పేస్‌ఎక్స్‌ 


టెక్స్‌స,మే 30: స్పేస్‌ఎక్స్‌ మరో స్టార్‌షిప్‌ రాకెట్‌ నమూనాను కోల్పోయిం ది. దక్షిణ టెక్స్‌సలో కంపెనీకి చెందిన పరీక్షా కేంద్రంలో శుక్రవారం నవతరం స్టార్‌షిప్‌ రాకెట్‌ నాలుగో నమూనాను పరీక్షించారు. ఈ రాకెట్‌ ఇంజిన్‌ను మండించగానే ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి రాకెట్‌ నమూనా పూర్తిగా కాలిబూడిదైంది. రాకెట్‌ ప్రయోగ వేదిక కూడా పాడయినట్టుగా తెలుస్తోంది.  ఈ పేలుడు వీడియోను నాసా స్పేస్‌ఫ్లైట్‌ రికార్డు చేసింది. 394 అడుగుల పొడవున్న ఈ స్టార్‌షిప్‌ రాకెట్‌ ద్వారా మనుషులతోపాటు 100 టన్నుల కార్గోను చంద్రుడు, అంగారక గ్రహం పైకి తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో రూపొందించారు. ఇప్పటికే స్పేస్‌ ఎక్స్‌ మూడు టెస్ట్‌ రాకెట్‌ వెర్షన్లను కోల్పోయింది. ఇప్పుడు నాలుగోది కూడా విఫలమైంది.    


Updated Date - 2020-05-31T08:36:06+05:30 IST