Singapore: వీధుల్లో గస్తీ తిరుగుతున్న రోబోలు..ఉల్లంఘనలపై ప్రజలకు హెచ్చరికల జారీ

ABN , First Publish Date - 2021-10-06T17:03:26+05:30 IST

సింగపూర్ దేశంలోని వీధుల్లో గస్తీ తిరిగేందుకు రోబోలను రంగంలోకి దించారు...

Singapore: వీధుల్లో గస్తీ తిరుగుతున్న రోబోలు..ఉల్లంఘనలపై ప్రజలకు హెచ్చరికల జారీ

సింగపూర్: సింగపూర్ దేశంలోని వీధుల్లో గస్తీ తిరిగేందుకు రోబోలను రంగంలోకి దించారు.కాపలాగా ఉన్న ఈ రోబోలు నగరంలో అవాంఛనీయంగా ప్రవర్తించే వారిని గుర్తించి వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.గతంలో హౌసింగ్ ఎస్టేట్లు, షాపింగ్ సెంటర్లలో రెండు రోబోలను కాపలాగా ఉంచారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలు, ముఖ గుర్తింపు సాంకేతికతతో ఏర్పాటు చేసిన ల్యాంప్ స్తంభాలతోపాటు రోబోలు నిత్యం సింగపూర్ నివాసులపై నిఘా వేశాయి.సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోబోల నిఘా వల్ల తమ గోప్యతకు, పౌర స్వేచ్ఛకు విఘాతం వాటిల్లుతోందని సింగపూర్ పౌరులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


అనుచిత సాంకేతికతతో అశాంతి పెరుగుతున్నా, ప్రజలు కఠినమైన నియంత్రణకు అలవాటు పడ్డారు.చక్రాలపై తిరుగుతున్న నిఘా రోబోలు 7 కెమెరాలతో ప్రజలకు వారి అవాంచనీయమైన ప్రవర్తనపై హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేసినా, సైకిళ్లను సరిగ్గా పార్కింగ్ చేయకపోవడం, కరోనావైరస్ సామాజిక దూర నియమాలను ఉల్లంఘించడం లాంటి ఉల్లంఘనలపై రోబోలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇటీవల పెట్రోలింగ్ చేసిన జేవియర్ రోబోట్ హౌసింగ్ ఎస్టేట్ గుండా వెళ్లి చెస్ మ్యాచ్ ఆడుతున్న వృద్ధుల ముందు ఆగింది.


‘‘దయచేసి మీరు ఒక మీటర్ సామాజికదూరాన్ని పాటించండి’’అంటూ రోబోటిక్ వాయిస్ వినిపించింది.సెప్టెంబరులో మూడు వారాల ట్రయల్ లో భాగంగా హౌసింగ్ ఎస్టేట్, షాపింగ్ సెంటర్‌లో పెట్రోలింగ్ చేయడానికి రెండు రోబోలను నియమించారు. సింగపూర్ ప్రభుత్వం రోబోలకు పెట్రోలింగ్ విధులివ్వడాన్ని సమర్ధించింది.

Updated Date - 2021-10-06T17:03:26+05:30 IST