రోబోల సాయంతో...

ABN , First Publish Date - 2020-03-21T05:51:32+05:30 IST

కరోనా పంజా విసిరిన నేపథ్యంలో రోబోల కార్యక్షేత్రం మారింది. ఇన్నాళ్లు ఆతిథ్య, నిర్మాణ, తయారీ లాంటి రంగాలకే ఎక్కువగా పరిమితమైన రోబోల వినియోగం ఇప్పుడు కేరళలో ఒక కొత్తపుంత తొక్కింది. అక్కడ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో రోబోలు తమవంతు

రోబోల సాయంతో...

కరోనా పంజా విసిరిన నేపథ్యంలో రోబోల కార్యక్షేత్రం మారింది. ఇన్నాళ్లు ఆతిథ్య, నిర్మాణ, తయారీ లాంటి రంగాలకే ఎక్కువగా పరిమితమైన రోబోల వినియోగం ఇప్పుడు కేరళలో ఒక కొత్తపుంత తొక్కింది. అక్కడ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో రోబోలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. కొచ్చి సమీపంలోని ‘కేరళ టెక్నాలజీ ఇన్నొవేషన్‌ జోన్‌’లోని మేకర్స్‌ విలేజ్‌ దగ్గర ఈ రోబోలను ఏర్పాటు చేశారు. స్టార్టప్‌ కాంప్లెక్స్‌లోని కంపెనీల్లో 600 మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ రెండు రోబోలు ప్రవేశం దగ్గర నిలబడి ఉద్యోగుల చేతుల మీద శానిటైజర్లను స్ర్పే చేస్తున్నాయి. అవసరమైన వారికి మాస్క్‌లు అందిస్తున్నాయి. అంతేకాదు కోవిడ్‌ - 19 వైర్‌సకు సంబంధించిన సందేహాలను కూడా ఆ రోబోలు తీరుస్తున్నాయి. కరోనాకు సంబంధించిన ఏ విషయం గురించి అడిగినాఆ రోబోలు ఇట్టే చెప్పేస్తున్నాయి. ఈ వినూత్న కరోనా అవగాహన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Updated Date - 2020-03-21T05:51:32+05:30 IST