Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంతర్‌జిల్లాల నేరగాళ్ల అరెస్టు

చోరీకేసులో స్వాధీనం చేసుకున్న చోరీ సోత్తుతో రామచంద్రపురం డీఎస్‌పీ బాలచంద్రారెడ్డి, సీఐ శివగణేష్‌

  • రూ.10.13లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు స్వాధీనం

మండపేట, అక్టోబరు 14: మండపేట పట్టణంలో గతనెలలో జరిగిన చోరీ కేసులను పట్టణ పోలీసులు చేదించి వారినుంచి రూ.10.50లక్షలు విలువ చేసే బంగారు వెండి వస్తువులతోపాటు దొంగలను పట్టుకున్నారు. ఈ మేరకు మండపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి గురువారం వివరాలు వెల్లడించారు. గతనెల 10న అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని సంకావారివీధిలోఉన్న బంగారు దుకాణంలో ఉన్న బంగారు, వెండి వస్తువుల చోరీ జరిగింది. ఈ నేపథ్యంలో 14న మండపేట ఏడిద రోడ్డులో పద్దమ్మతల్లి ఆలయంవద్ద మోటారుసైకిల్‌పై వస్తున్న ముగ్గురిని తనిఖీ చేసి పట్టుకున్నారు. వారిలో ఏలూరుకు చెందిన కోసూరి రమేష్‌, తాడేపల్లిగూడేనికి చెందిన ఆరేటి పండు, మరొకరిని విచారించగా వీరు గతంలో ఒంగోలు, హనుమాన్‌ జంక్షన్‌, బొబ్బిలిలో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. మండపేట పట్టణానికి చెందిన వాసంశెట్టి దుర్గాప్రసాద్‌తో వీరిద్దరికి రామచంద్రపురంలో పరిచయమైంది. రమేష్‌ రామచంద్రపురం బంగారు దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరు మండపేట పట్టణంలోని గొల్లపుంతకాలనీ చెందిన ఇంట్లో బంగారు వెండి వస్తువులు చోరీ చేశారు. శ్రీకాళహస్తి, మణప్పురం గోల్డ్‌ఫైనాన్స్‌లో 44 గ్రాముల బంగారం తాకట్టు పెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. వీరినుంచి స్వాధీనం చేసుకున్న 126 గ్రాములు బంగారం, 6.50 కిలోల వెండి వస్తువుల విలువ మొత్తం కలిపి రూ.10లక్షలు13వేలు ఉంటుందని చెప్పారు. పట్టణ ఇన్‌చార్జి సీఐ శివగణేష్‌, పట్టణ ఎస్‌ఐ రాజేష్‌కుమార్‌ తమ సిబ్బందితో నిందితులను పట్టుకున్నారన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
Advertisement