పెద్దమ్మా..బాగున్నావా అంటూ బురిడీ

ABN , First Publish Date - 2021-02-28T06:05:57+05:30 IST

పెద్దమ్మా.. బాగున్నావా అంటూ ఓ వృద్ధురాలిని ఆ ప్యాయంగా పలకరించి బురిడీ కొట్టించాడు కేటుగాడు. సుమారు రూ.లక్ష విలువైన బంగారపు గొలుసును అపహరించుకెళ్లాడు. ఈ సంఘటన ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గల శ్మ శాన వాటిక ఎదురుగా ఉన్న నివాసంలో జరిగింది.

పెద్దమ్మా..బాగున్నావా అంటూ బురిడీ

వృద్ధురాలి మెడలోని 3 సవర్ల బంగారపు గొలుసు చోరీ


ఒంగోలు (క్రైం), ఫిబ్రవరి 27 : పెద్దమ్మా.. బాగున్నావా అంటూ ఓ వృద్ధురాలిని ఆ ప్యాయంగా పలకరించి బురిడీ కొట్టించాడు కేటుగాడు. సుమారు రూ.లక్ష విలువైన బంగారపు గొలుసును అపహరించుకెళ్లాడు. ఈ సంఘటన ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో గల శ్మ శాన వాటిక ఎదురుగా ఉన్న నివాసంలో జరిగింది.  వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల మే రకు మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన ఓగిరాల సబ్బాయమ్మ (60) శనివారం బస్టాండులో బస్సు దిగి నడుచుకుటూ సమైక్యనగర్‌లో తన బంధువులు ఇంటికి వెళుతుంది. దారిలోని శ్మశానం వద్దకు రాగానే ఎదురుగా ఓ యువకుడు వచ్చి ఏమి పెద్దమ్మా బాగు న్నావా.. నేను కోటిరెడ్డి కొడుకును అంటూ పరిచయం చేసుకున్నాడు. నా కళ్లు సరిగా కనిపిం చవని, గుర్తుపట్టలేనని ఆమె బదులిచ్చింది. దీంతో ఆ యువకుడు తన ఇంటికి వెళ్ళదామని, మా అమ్మను చూస్తే గుర్తు పడతావంటూ మాయమాటలు చెప్పాడు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత ఓ ఇంటి ముందు పంచలో కూర్చోబెట్టి సుబ్బామయ్మతో మాట్లాడాడు. నీ మెడలో బంగారం గొలుసు బాగుందని, ఇలాంటితే తన అమ్మకు చేయిచాలని చెప్పాడు. ఆమె మెడలో ని గొలుసు తీసి ఇంట్లో ఉన్న తన అమ్మకు చూపించి వస్తానంటూ తీసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఎంతకీ ఆ యువకుడు రాకపోవడంతో వృద్ధురాలు చుట్టుపక్కల వారికి జరిగిన విషయం చెప్పి గొల్లుమంది. తాను మోసపోయనని తెలుసుకొని వన్‌టౌన్‌ పోలీసులకు ఫి ర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలోని ఫుటేజిని పరిశీలిస్తున్నారు.


Updated Date - 2021-02-28T06:05:57+05:30 IST