Abn logo
Oct 12 2021 @ 15:51PM

Sangareddy : నారాయణఖేడ్‌లో భారీ చోరీ..

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్‌లో భారీ చోరీ జరిగింది. మార్వాడీ గల్లీ కాలనీలో తాళం వేసి ఉన్న  ఓ వ్యాపారి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. మొత్తం 10 కిలోల వెండి, 60 తులాల బంగారం, నాలుగు లక్షల యాభై వేల రూపాయిలు నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. పనిమీద బయటికెళ్లిన వ్యాపారి ఇంటికొచ్చి చూసే సరికి ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో వ్యాపారి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

TAGS: ROBBERY

ఇవి కూడా చదవండిImage Caption