Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Newjersey Robbery: అమెరికాలోని భారతీయ నగల దుకాణంలో భారీ దోపిడీ..!

twitter-iconwatsapp-iconfb-icon
Newjersey Robbery:  అమెరికాలోని భారతీయ నగల దుకాణంలో భారీ  దోపిడీ..!

ఎన్నారై డెస్క్: న్యూజెర్సీ రాష్ట్రంలోని(అమెరికా) ఓ భారతీయ నగల దుకాణంలో తాజాగా భారీ చోరీ జరిగింది.  మిడిల్‌సెక్స్ కౌంటీలోని ఓక్‌ట్రీ రోడ్‌లో గల వీరానీ జ్యువెలర్స్‌లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు పది మంది ఈ చోరీకి పాల్పడి ఉంటారని సమాచారం. ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ షోరూంలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. సినీఫక్కీలో గన్స్‌తో దుకాణంలోకి చొరబడ్డ దుండగులు.. సిబ్బందిని బెదిరించి భారీ మొత్తంలో నగలు, నగదును ఎత్తుకెళ్లిపోయారు. దోపిడీదారులు గాల్లో కాల్పులకు కూడా తెగబడ్డట్టు సమాచారం. మరోవైపు.. స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి సంభవించలేదని తెలుస్తోంది. కాగా.. భారతీయ వ్యాపార సముదాయాలు అధికంగా ఉండే ఓక్ ట్రీ రోడ్‌‌కు లిటిల్ ఇండియా అనే పేరు కూడా ఉంది. 

Newjersey Robbery:  అమెరికాలోని భారతీయ నగల దుకాణంలో భారీ  దోపిడీ..!


Newjersey Robbery:  అమెరికాలోని భారతీయ నగల దుకాణంలో భారీ  దోపిడీ..!



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.