Abn logo
Jan 16 2021 @ 06:28AM

హైదరాబాద్ : బంగారం దుకాణంలో భారీ చోరీ

  • 1.2 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు


హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్‌ : సికింద్రాబాద్‌ పాట్‌ బజార్‌లోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. వెంటిలేటర్‌ గ్రిల్‌ను విరగ్గొట్టి షాపులోకి వెళ్లిన అగంతకులు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాట్‌ మార్కెట్‌కు చెందిన అనిల్‌ జైన్‌.. అదే ప్రాంతంలో నేమిచంద్‌ జైన్‌ జువెల్లరీ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుఝామున 3.30 గంటల ప్రాంతంలో దుకాణం వెనుక వైపు ఉన్న వెంటిలేటర్‌ గ్రిల్స్‌ వంచి లోపలికి ప్రవేశించిన దొంగలు.. దుకాణంలో ఉన్న కిలో 200 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్త్తుకెళ్లారు. శుక్రవారం పండుగ కావడంతో మధ్యాహ్నం తరువాత యజమాని దుకాణానికి రాగా సామగ్రి చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించిన ఆయన దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు, ఏసీపీ వినోద్‌కుమార్‌ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement
Advertisement