శ్రీరామ నవమి పర్వదినాన దేవాలయంలో చోరీ

ABN , First Publish Date - 2020-04-03T13:06:57+05:30 IST

శ్రీరామ నవమి పర్వదినాన ఆంజనేయ స్వామి గుడిలో చోరీ జరిగింది. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని

శ్రీరామ నవమి పర్వదినాన దేవాలయంలో చోరీ

హైదరాబాద్/కుత్బుల్లాపూర్‌ : శ్రీరామ నవమి పర్వదినాన ఆంజనేయ స్వామి గుడిలో చోరీ జరిగింది. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలోని శ్రీభక్తాంజనేయ యేగేశ్వరస్వామి దేవాలయంలో గురువారం తెల్లవారుజామున చోరీకి పాల్పడిన దుండగులు రెండు హుండీల తాళాలు పగులగొట్టి డబ్బును దోచుకెళ్లారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో దేవాలయానికి వచ్చిన ఆర్చకులు విషయాన్ని గ్రహించి ఆలయ కమిటీ, పోలీసులకు సమాచారం అందించారు. 


హుండీలను కార్తీక మాసంలో తెరిచామని, అప్పటి నుంచి వాటిని లెక్కించలేదని, హుండీల్లో సుమారు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు డబ్బు ఉంటుందని తెలిపారు. అదే కాలనీలో ఉన్న రామాలయంలో కూడా గత ఆదివారం తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినా ఎటు వంటి నష్టం జరగలేదని, లాక్‌డౌన్‌ అనంతరం ఇది రెండో సంఘటనగా వారు తెలిపారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు, క్లూస్‌ టీం వేలి ముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-04-03T13:06:57+05:30 IST