Viral Video: ఈ రాకాసి పీత‌ల‌తో జాగ్రత్త‌.. ప‌ట్టుకుంటే ఎముక‌ల‌ను సైతం విరిచేస్తాయి.. ఇవి ఎక్కుడుంటాయంటే?..

ABN , First Publish Date - 2022-01-06T08:55:53+05:30 IST

స‌ముద్ర జీవులైన పీత‌లంటే.. చాలామంది మాంసాహార ప్రియుల‌కు ఇష్టం. కానీ వీటితో జాగ్రత్తగా ఉండాలి. పీత‌ల‌కు బ‌లం వాటి కాళ్లల్లో ఉంటుంది. వాటి కాళ్లకు దంతాల ఆకారంలో ఉండే కొమ్ముల‌తో అవి ప‌ట్టుకుంటే సాధార‌ణంగా వ‌ద‌ల‌వు...

Viral Video: ఈ రాకాసి పీత‌ల‌తో జాగ్రత్త‌.. ప‌ట్టుకుంటే ఎముక‌ల‌ను సైతం విరిచేస్తాయి.. ఇవి ఎక్కుడుంటాయంటే?..

స‌ముద్ర జీవులైన పీత‌లంటే.. చాలామంది మాంసాహార ప్రియుల‌కు ఇష్టం. కానీ వీటితో జాగ్రత్తగా ఉండాలి. పీత‌ల‌కు బ‌లం వాటి కాళ్లల్లో ఉంటుంది. వాటి  కాళ్లకు దంతాల ఆకారంలో ఉండే కొమ్ముల‌తో అవి ప‌ట్టుకుంటే సాధార‌ణంగా వ‌ద‌ల‌వు. అలాంటిది ఈ పీత‌లు పెద్ద ఆకారంలో ఉంటే వాటి శ‌క్తి నాలుగింత‌లవుతుంది. వీటిని ప‌ట్టుకునేట‌ప్పుడు జాగ్రత్తగా ఉండాల‌ని లేక‌పోతే ఇవి చేతి ఎముక‌ల‌నే విరిచేస్తాయని స్థానికులంటున్నారు.


పెద్ద ఆకారంలో ఉండే రాకాసి పీత‌లు ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ దీవుల్లో ల‌భిస్తాయి. ఈ రాకాసి పీత‌ల‌ను స్థానికులు రాబ‌ర్స్ క్రాబ్స్ అని పిలుస్తారు. ఈ రాబ‌ర్స్ క్రాబ్స్ శరీరం చాలా పెద్దగా ఉంటుంది.  ఇవి వాటి కొమ్ముల‌తో కొబ్బరి బొండాల‌ను సుల‌భంగా వ‌లిచేస్తాయ‌ని.. అందులోని కొబ్బెర‌ని ఆహారంగా తింటాయ‌ని స్థానికులు చెబుతున్నారు. 


ఇలాంటి ఒక రాకాసి పీత ఆ దీవుల్లోని ఒక మైదానంలో క‌న‌బ‌డింది. అక్కడ కొంద‌రు గోల్ఫ్ ఆడుతుంటే.. అది ఒక గోల్ఫ్ స్టిక్‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుంది. ఇది చూసిన ఒక వ్యక్తి దాని నుంచి గోల్ఫ్ స్టిక్‌ను తీసుకునేందుకు ప్రయత్నించ‌గా.. ఆ రాకాసి పీత గోల్ఫ్ స్టిక్‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని విరిచేసింది. ఇదంతా ప‌క్కనే ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో వైర‌ల్ అవుతోంది.



Updated Date - 2022-01-06T08:55:53+05:30 IST