ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు
ఓర్వకల్లు, నవంబరు 29 : ఓటీఎస్ (జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం) పేరుతో పేదల డబ్బును దోచుకుంటారా? అని జడ్పీ మాజీ చైర్మన మల్లెల రాజశేఖర్ ధ్వజమెత్తారు. సోమవారం ఓర్వకల్లు ఆర్టీసీ బస్టాండు నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. రూ.10 వేల కోసం ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని రాజశేఖర్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా ఇళ్లు రిజిస్ర్టేషన చేసి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామన్నారు.