ఇవేం రోడ్లు?

ABN , First Publish Date - 2020-09-28T11:31:32+05:30 IST

వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించి, రవాణా సౌకర్యాన్ని కల్పించాలిన ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షుడు

ఇవేం రోడ్లు?

అధ్వానంగా మారిన రహదారులు

గోతులతో ప్రమాదకరంగా మారిన వైనం


ఎక్కడికక్కడ దెబ్బతిన రహదారులు ప్రమాదకరంగా మారుతున్నాయి. గతుకుల్లో వాహనాలు పడి అవి మరమ్మతులకు గురవుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులపై పడిన గోతులు నీటితో నిండి ఉంటున్నాయి. అటుగా వెళ్తున్న వాహనదారుల వాటిలో పడి ప్రమాదాలకు గురవుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం, రూరల్‌, రాజానగరం, రంపచోడవరం, అనపర్తి నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు స్పందించి రహదారులు మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.


దేవీపట్నం, సెప్టెంబరు 27: వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించి, రవాణా సౌకర్యాన్ని కల్పించాలిన ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షుడు ఇల్లా రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో రోడ్లన్నీ దెబ్బతినడంతో ఆయా ప్రాంతాల ప్రజలు రవాణా సౌకర్యంలేక ఇప్పటికే నానా అవస్థలు పడుతున్నారని, 2018 మంటూరు లాంచీ ప్రమాదం జరిగిన వెంటనే కొండమొదలు వచ్చిన ఉన్నతాధికారులు నెలరోజుల్లో రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ సదరు రోడ్డు ఇప్పటికి కూడా వేయకపోగా, గోదావరి ప్రయాణం నిలిచిపోవడం వల్ల, రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండమొదలు పంచాయతీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఇదే సమస్యను ఎన్నోసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. కొండమొదలు పరిసర గ్రామాలైన పలు గ్రామాలకు రంపచోడవరం మండలం కొయ్యలగూడెం నుంచి కొండమొదలు వరకు 15కిలోమీటర్లు సంఘం నాయకులు ఇల్లా రామిరెడ్డి నాయకత్వంలో ఆయా గ్రామాల గ్రామస్తులతో స్వచ్ఛందంగా రహదారిని మరమ్మతు పనులు చేపట్టారు. కుండపోత వర్షాలకు రహదారులు ఛిద్రంగా మారినా ఐటీడీఏ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదని, గతేడాది రూ.40లక్షలతో రోడ్ల పనులను చేపట్టారని, అవి కూడా పూర్తి కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వం స్పందించాలి

ఏజెన్సీ గ్రామాల్లో ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ఐటీడీఏ అధికారులు వచ్చినా గిరిజన గ్రామాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, ప్రభుత్వం కోట్లాది రుపాయలు నిధులు మంజూరు చేసినప్పటకి ఇ క్కడి అధికారులు, కాంట్రాక్టర్లకు భోజ్యం అవుతుందని ఆయన ఆరోపించారు. తప్పు చేస్తే తప్పించుకోలేరు..

Updated Date - 2020-09-28T11:31:32+05:30 IST