రోడ్లు, కాలుష్యంపై నిరసన

ABN , First Publish Date - 2021-12-05T05:21:46+05:30 IST

రోడ్లు, కాలుష్యంపై నిరసన

రోడ్లు, కాలుష్యంపై నిరసన
తాండూరు అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రిలే దీక్షలో కూర్చున్న నాయకులు

తాండూరు: అధ్వానంగా ఉన్న రోడ్లు, వాయు కాలుష్యంపై తాండూరులోని పలు ప్రజాసంఘాలు రిలే దీక్షకు దిగాయి. శనివారం తాండూరు బంద్‌ నిర్వహించి అంబేద్కర్‌ చౌక్‌ వద్ద నిరసన చేపట్టారు. తాండూరు డెవల్‌పమెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చి రిలే దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సీఐ రాజేందర్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాసంఘాల ప్రతినిధులు నినాదాలు చేస్తూ ఇందిరాచౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. పట్టణ రోడ్లను బాగుచేయాలని డిమాండ్‌ చేశారు. గాలిలో దుమ్ము, ధూళి కాలుష్యాన్ని నియంత్రించాలని, పట్టణంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వారు పేర్కొన్న సమస్యలను ఏడాదిలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు.

Updated Date - 2021-12-05T05:21:46+05:30 IST