రోడ్లు ఇలా.. వెళ్లేదెలా?

ABN , First Publish Date - 2022-01-24T06:32:33+05:30 IST

మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిమ్మాపురం నుంచి కోడూరుకు వెళ్లే తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్డు, అర్వపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లే ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.

రోడ్లు ఇలా.. వెళ్లేదెలా?
ప్రమాదకరంగా కోడూరు వాగు దాటుతున్న ప్రజలు (ఫైల్‌)

అర్వపల్లి మండలంలో అధ్వానంగా రోడ్లు

 ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు 

 మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిమ్మాపురం నుంచి కోడూరుకు వెళ్లే  తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్డు, అర్వపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లే ఏడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఈ రోడ్లలో అడుగడుగునా కంకర లేచి గుంతలు పడ్డాయి.  దీంతో ఈ దారుల నుంచి రాకపోకలు ప్రజలు  ఇబ్బంది పడుతున్నారు.  ఈ రోడ్లకు వెంటనే మరమ్మతు చేయించ డంతో పాటు బొల్లంపల్లి, వేల్పుచర్ల గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు. వర్షం కురిస్తే కోడూరు గ్రామ శివారులో వాగు పొంగుతున్నందున కోడూరు, కొమ్మాల, అన్నారం గామాల్లో రాకపోకలు నిలిచి పోతున్నాయి. ఈ ప్రాంతంలో బిడ్జీ నిర్మించి ఆదుకోవాలని  ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- అర్వపల్లి







Updated Date - 2022-01-24T06:32:33+05:30 IST