రోడ్లు వేశారు.. డ్రెయిన్లు మరిచారు

ABN , First Publish Date - 2021-04-21T06:15:24+05:30 IST

రోడ్లు వేశారు.. డ్రెయిన్లు మరిచారు

రోడ్లు వేశారు.. డ్రెయిన్లు మరిచారు
నిలిచిపోయిన మురుగు

ఫ రోడ్డు నిర్మాణ వ్యర్థాలతో పూడుకుపోయిన డ్రెయిన్లు

ఫ పలుచోట్ల నిలిచిపోయిన మురుగు 

ఫ ఉధృతమవుతున్న దోమలు

 మొగల్రాజపురం, ఏప్రిల్‌ 20 : పటమట 11వ డివిజన్‌లో ఎన్నికల ముందు నాలుగు సిమెంట్‌ రోడ్లు నిర్మించారు.  డ్రెయిన్ల నిర్మాణం చేపట్టకపోవ టంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు.  మరి కొన్ని రోడ్లలో రోడ్డు నిర్మాణానికి వాడిన మెటిరి యల్‌ వ్యర్థాలు డ్రెయిన్లో చేరి మురుగు ప్రవాహం ఆగిపోయింది. మున్సిపల్‌ సిబ్బంది పూడిక పనులు చేపట్టకపోవటంతో  ఈ ప్రాంతంలో వాడుక నీరు రోడ్డు పక్కన చేరి దోమలకు ఆవాసంగా మారింది. దీంతో మురుగు పోయే మార్గం లేక ఆ ప్రాంతంలో దుర్వాసన వెదజల్లుతోంది. భాగయ్య వీధి, అచ్చమ్మ వీధి, దానయ్య వీధి, యాదవుల బజారులో మూడేళ్ల క్రితం పాత యూజీడీ లైను మీద కొత్త యూజీడీ లైను వేశారు. తరువాత రెండున్నరేళ్లకు మంచినీటి లైను వేశారు. ఈ రెండు పనుల కోసం రోడ్లను తవ్వి మరమ్మతులు చేశారు. రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. దీంతో  పలు సార్లు  స్థానికులు  రోడ్ల దుస్థితిని అధికారులు, ప్రజాప్రతి నిఽధులకు మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదు. చివరకు ఎన్నికల కొద్ది నెలల ముందు డివిజన్‌ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రోడ్ల మధ్య తవ్విన గుంతలను పూడ్పించారు. ఆ తరువాత ఎన్నికల ముందు సిమెంట్‌ రోడ్లను వేశారు. భాగయ్య బజారులో రోడ్డుకు డ్రెయిన్‌కు మధ్య ఖాళీ వదిలి కొత్త రోడ్డు వేశారు. దీంతో ఈ బజారులో వాహనాలను రోడ్డుమీద నిలపాల్సిన పరిస్థితి. రోడ్డు కిందకు దింపి పార్కింగ్‌ చేయడానికి కుదరడం లేదు. దీంతో రోడ్డు వేసినా వాహనాల పార్కింగ్‌ వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మరోక పక్కన  డ్రెయిన్‌ కట్టకుండా రోడ్డు వేయడంపై  ఈ ప్రాంత వాసులు గుర్రుగా ఉన్నారు. మిగిలిన రోడ్లలో కూడా డ్రెయిన్‌ వరకు రోడ్డు వేశారు. ఇక్కడ కూడా సైడు డ్రెయిన్‌లను వదిలేశారు. పాత డ్రెయిన్లు పల్లంగా ఉండిపోయాయి. రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ తాలూకా ఉద్యోగులను డ్రెయిన్ల నిర్మాణం గురించి అడిగితే తమకు సంబంధం లేదన్నారు. సం బంధిత అధికారులు స్పందించి ముందు సైడు కాల్వలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.  

Updated Date - 2021-04-21T06:15:24+05:30 IST