Abn logo
Dec 6 2020 @ 00:19AM

దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలి


మార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 5 : నివర్‌ తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం వారు పట్టణంలోని దత్తసాయి గుడి, విజ యా టాకీస్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు నిరసన తెలిపారు. తు ఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు మం డలంలోని పలు గ్రామాలతోపాటు, పట్టణం లోని వివిధ కాలనీల్లోని రోడ్లు దెబ్బతిన్నా యని అన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పగిడి మర్రి రామచంద్ర, శాసనాల సరోజిని,  లక్ష్మి రమణ  పాల్గొన్నారు.  

పామూరులో..

పామూరు : ఇటీవల కురి సిన వర్షాలకు పంటలతో పా టు అంతర్గత రోడ్లు అఽధ్వా నం గా తయారయ్యాయని, రోడ్ల ని ర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బం దులు తీర్చాలని బీజేపీ మం డల అధ్యక్షుడు కె.ప్రభాకర్‌ తెలిపారు. అ నంతరం డీటీ  నాసరుద్దీన్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని అల్లాలమ్మ గుడి రోడ్డు, డీవీపాలెం రోడ్లు నిర్మాణాలు చేప ట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో స్థానికులు పోలయ్య, మస్తాన్‌, జార్జీ, ప్రసాద్‌, మునెమ్మ, శ్రావణి, క్రిష్ణవేణి, ఆకాష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

సీఎస్‌పురంలో..

సీఎస్‌పురం  :  తుఫాన్‌ కారణంగా పం టలు నష్టపోయిన రైతులకు వెంటనే పరి హారం చెల్లించాలని  బీజేపీ మండల అధ్య క్షుడు ఎం.లక్ష్మయ్య యాదవ్‌ కోరారు. తహసీ ల్దార్‌ కార్యాలయంలో శనివారం డీటీ ఆంజనే యులను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement