అమ్మో.. గోతులు

ABN , First Publish Date - 2022-08-19T05:14:45+05:30 IST

అధ్వాన రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్నాయి.

అమ్మో.. గోతులు
బ్రాహ్మణచెరువు–వీరవాసరం రహదారిలో పొలమూరు వద్ద గోతులు

రహదారులు అధ్వానం

ప్రయాణం ప్రమాదం


పెనుమంట్ర / ఉండి, ఆగస్టు 18: అధ్వాన రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. గోతుల రహదారులపై ప్రయాణానికి వాహనదారులు  భయపడుతున్నారు. బ్రాహ్మణ చెరువు–వీరవాసరం రహదారిలో పొలమూ రు శివారులో గోతుల్లో పడుతూ లేస్తూ ప్రయాణించాల్సిందే. రహదారులు అధ్వానం కావడంతో పాటు భారీ వర్షాలకు గోతులు మరింత పెద్దవి కావడంతో వాహనాలు పడిపోతున్నాయి. ప్రయాణికుల ఆందోళన నేపథ్యం లో ఆర్‌అండ్‌ బి అధికారులు గోతులను పూడ్చారు. మళ్ళీ వర్షాలు కురవడం తో పరిస్థితి మొదటికి వచ్చింది. మరింత గోతుల్లో రాళ్లు పైకి లేవడంతో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. వాహనదారులు గోతులను చూసి భయపడి కాస్త మేర వాహనాలు దిగి తోసుకుంటూ గోతులు దాటిన తర్వాత వెళుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు మరింత పెరిగాయి. ఆటోల టైర్లకు పంక్చర్‌ కావడంతో డ్రైవర్లు నానా అవస్ధలు పడుతున్నారు. అధికారులు స్పందించి గోతులను పూడ్చాలని కోరుతున్నారు. రోడ్లు అధ్వానం కావడంతో ఆర్‌ అండ్‌ బి పెనుమంట్ర ఏఈ యశ్వంత్‌ను ప్రశ్నించగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టవలసి ఉందని తెలిపారు. వర్షాలు కారణంగా పనులు నిలిచిపోయాయన్నారు. పొలమూరు లోని హాస్టల్‌ నుంచి నవుడూరుసెంటర్‌ సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ పనులు జరగాలి ఉందని, ఇప్పటికే కల్వర్టు పనులు పూర్తి చేశామన్నారు. త్వరలో రోడ్డు పనులను చేపడతామని తెలిపారు.


వర్షంతో గోతులు చెరువులే..


ఉండి మండలంలో గోతులతో అధ్వానంగా రోడ్లపై వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. యండగండి – భీమవరం రహదారి భారీ గోతు లతో అధ్వానంగా మారింది. చిలుకూరు – ఉండి ఆర్‌అండ్‌బి రహదారిపై ఎక్కడబడితే అక్కడ గోతులుపడ్డాయి. ప్రయాణికులు ఈ గోతులలో పడి పోయి గాయపడుతున్నారు. వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతు న్నాయి. చిలుకూరు శివారు ఆర్‌అండ్‌బి రహదారిపై గోతులను పూడ్చడా నికి పంచాయతీ అధికారులు ముందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు రహదారులను అభివృద్ధి చేయలేదని పలువురు మండి పడుతున్నారు.

Updated Date - 2022-08-19T05:14:45+05:30 IST