రోడ్డు నిర్మాణ విషయంలో వైసీపీలో ఘర్షణ

ABN , First Publish Date - 2021-03-08T05:12:57+05:30 IST

నూతన రహదారి నిర్మాణ విషయంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెదారికట్ల గ్రామంలో జరిగింది.

రోడ్డు నిర్మాణ విషయంలో వైసీపీలో  ఘర్షణ
వైద్యశాలలో బాధితుడిని విచారిస్తున్న సీఐ శ్రీరామ్‌



కొనకనమిట్ల, మార్చి 7 : నూతన రహదారి నిర్మాణ విషయంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెదారికట్ల గ్రామంలో జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రామంలోని ఉన్నత పాఠశాల నుంచి పెద్ద కొండకు వెళ్లే రహదారి నిర్మాణ పనులను వైసీపీకి చెందిన రాంబాబు పర్యవేక్షిస్తున్నాడు. ఈ క్రమంలో రహదారికి మట్టి పోసేందుకు ట్రాక్టర్లతో మట్టి పోయిస్తున్నాడు.    ఈ క్రమంలో సర్పంచ్‌ చెంచయ్య వర్గీయులు 10 మంది రాంబాబును అడ్డుకున్నారు. ట్రాక్టర్‌తో మట్టి పోస్తున్న డ్రైవర్లను కిందకు లాగేశారు. ఈ సందర్భంగా రాంబాబు వారిని అడ్డుకున్నారు. పనులకు చెందిన వర్క్‌ ఆర్డర్‌ తమకు ఉందని ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. సర్పంచ్‌ వర్గీయులు ట్రాక్టర్‌ ఎక్కి రాంబాబుపైకి నడిపారు. దీంతో రాంబాబు కాలికి తీవ్ర గాయమైంది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రుడిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఐ వీ.శ్రీరామ్‌ క్షతగాత్రుడిని విచారించారు. అతని ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-03-08T05:12:57+05:30 IST