రూ.20 లక్షలతో రోడ్డు

ABN , First Publish Date - 2021-03-01T04:51:09+05:30 IST

నగరంలోని మూడవ డివిజన్‌ దండోరా కాలనీ అంబేడ్కర్‌నగర్‌, వరద కాలనీ తిలక్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉండేది.

రూ.20 లక్షలతో రోడ్డు
రోడ్డుపై కంకర వేసిన దృశ్యం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ 

హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు 

కడప(నాగరాజుపేట), ఫిబ్రవరి 28: నగరంలోని మూడవ డివిజన్‌ దండోరా కాలనీ అంబేడ్కర్‌నగర్‌, వరద కాలనీ తిలక్‌నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉండేది. దీంతో ‘ఛిద్రమైన రోడ్లు’ అన్న శీర్షికన డిసెంబరు 6వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పాలకులు, అధికారులతో పాటు డిప్యూటీ సీఎం అంజద్‌బాషా చొరవ తీసుకుని 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రధాన రహదారి అయిన రిమ్స్‌ పోలీసు స్టేషన్‌ నుంచి దండోరాకాలనీ వరకు సిమెంటు రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు నిధులు మంజూరు చేశారు. రోడ్డుకు ఉన్న గుంతలను పూడ్చి ప్రస్తుతం కంకర పరిచారు. దీంతో స్థానికులు ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-03-01T04:51:09+05:30 IST