హెల్మెట్‌ను తప్పక ధరించండి

ABN , First Publish Date - 2021-01-24T06:08:08+05:30 IST

వాహనదా రులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం.పురేంద్ర పిలుపునిచ్చారు.

హెల్మెట్‌ను తప్పక ధరించండి
ప్రమాణం చేస్తున్న విద్యార్థులు

హెల్మెట్‌ను తప్పక ధరించండి

డీటీసీ ఎం.పురేంద్ర

రామలింగేశ్వరనగర్‌, జనవరి 23 : వాహనదా రులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎం.పురేంద్ర పిలుపునిచ్చారు. శనివారం వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంవీఐ జి.సంజీవ్‌కుమార్‌, రవాణా శాఖ ఉద్యోగ సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజాబాబు, వి.ఆర్‌.కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఇన్‌చార్జి నరేంద్ర పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ : రోడ్డు  భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శనివారం హనుమాన్‌జంక్షన్‌లో పోలీస్‌ సిబ్బంది  మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఎస్సై చంటిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T06:08:08+05:30 IST