Abn logo
Sep 21 2021 @ 11:47AM

రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు అవగాహన

పెరంబూర్‌(చెన్నై): రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక మద్రాసు క్రైస్తవ కళాశాల ప్రాంగణంలో కళాశాల కరస్పాండెంట్‌ జీజే మనోహరన్‌ అనుమతితో పీఎస్‌ఏ ఫౌండేషన్‌, హ్యాండిక్యాప్‌ ఇంటర్నేషనల్‌, ఆట్సావా ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న ట్రాఫిక్‌ విభాగం జాయింట్‌ కమిషనర్‌ సురేంద్రనాథ్‌ ప్రారంభించారు. ట్రాఫిక్‌ నిబంధనలు తెలియజేసేలా సుమారు రూ.4 లక్షలతో రోడ్‌ సేఫ్టీ అండ్‌ ఎస్‌పీసీపీ ల్యాబ్‌ ఏర్పాటుచేసి, విద్యార్థులు స్కీన్‌పై చూస్తూ వాహనం నడుపుతూ ట్రాఫిక్‌ నిబంధనల పాటించేలా వెళ్లడం దృశ్యరూపంలో చూపించారు. కార్యక్రమంలో ఆట్సావా ట్రస్ట్‌ నిర్వాహకులు ఎస్‌ఏ చెల్లదురై సహా పలువురు పాల్గొన్నారు.