రహదారికి Punith Rajkumar పేరు

ABN , First Publish Date - 2022-03-15T17:04:36+05:30 IST

నగరంలోని మైసూరు రోడ్డులోని నాయండహళ్లి జంక్షన్‌ నుంచి వెగాసిటీ మాల్‌ వరకు ఉన్న రహదారికి పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ పేరు పెట్టనున్నారు. ఈనెల 30న ఈ రహదారికి పేరు పెట్టే కార్యక్రమానికి ముహూర్త

రహదారికి Punith Rajkumar పేరు

బెంగళూరు: నగరంలోని మైసూరు రోడ్డులోని నాయండహళ్లి జంక్షన్‌ నుంచి వెగాసిటీ మాల్‌ వరకు ఉన్న రహదారికి పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ పేరు పెట్టనున్నారు. ఈనెల 30న ఈ రహదారికి పేరు పెట్టే కార్యక్రమానికి ముహూర్త ఖరారైంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మైతోపాటు రాజ్‌కుమార్‌ కుటుంబసభ్యులంతా పాల్గొనబోతున్నారు. 12 కిలో మీటర్ల పొడవైన రహదారికి పునీత్‌రాజ్‌కుమార్‌ పేరు పెట్టనున్నారు. బీబీఎంపీ మాజీ పాలకపక్షనేత ఎన్‌ఆర్‌ రమేశ్‌ గతంలోనే ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిన సంగతి విదితమే.

Updated Date - 2022-03-15T17:04:36+05:30 IST