రహదారి కష్టాలు

ABN , First Publish Date - 2022-08-10T05:30:00+05:30 IST

జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు రహదారులు రూపురేఖలను కోల్పోయాయి. మరింత అధ్వానంగా తయారయ్యాయి.

రహదారి కష్టాలు
పూర్తిగా పాడైన సాలూరు నుంచి మక్కువ వైపు వెళ్లే రహదారి

  గోతుల్లో చేరిన వర్షపునీరు

కొన్నిచోట్ల బురదమయం

వాహనదారులు, ప్రజలకు తప్పని ఇబ్బందులు

సాలూరు/గరుగుబిల్లి: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు రహదారులు రూపురేఖలను కోల్పోయాయి. మరింత అధ్వానంగా తయారయ్యాయి. వాహనదారులు, ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. ప్రధానంగా సాలూరు నుంచి  మక్కువ వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైంది. రహదారిపై ఏర్పడిన గుంతలన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. దీంతో ఏ గుంత .. ఎంత లోతు ఉందో తెలియక పలువురు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. వాటి మరమ్మతులపై సర్కారు దృష్టి సారించకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు గరుగుబిల్లి మండలంలోనూ పలు రహదారులు వర్షాలకు బురదమయంగా మారాయి.   కొంకడివరంలో సర్పంచ్‌ చొరవతో గ్రావెల్‌, రాతి బుగ్గిని వేసి చదును చేయించినా ఫలితం లేకపోయింది.  బురద  రహదారి నుంచి వాహనాలు కదలని పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. 

   

Updated Date - 2022-08-10T05:30:00+05:30 IST