దేశానికే తలమానికంగా వున్న తెలంగాణ రహదారులు

ABN , First Publish Date - 2022-06-26T21:52:42+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా రహదారులకు మహర్ధశ వచ్చిందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది.

దేశానికే తలమానికంగా వున్న తెలంగాణ రహదారులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా రహదారులకు మహర్ధశ వచ్చిందని ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. మెరుగైన రహదారులు దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయన్న విషయాన్ని ద`ష్టిలో పెట్టుకుని రహదారులనుఅభివృద్ధి పరిచినట్టు నివేదికలో పేర్కొన్నది. రవాణా సౌకర్యం బాగున్న సమాజాలు త్వరితగతిన పురోగమిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ 2014 కు ముందు అన్నిరంగాల్లో మాదిరిగానే రహదారుల విషయంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం, వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉండేది. జాతీయ రహదారులు చాలా తక్కువగా ఉండేవి. 


ఆర్ అండ్ బి రోడ్లలో 70 శాతం సింగిల్ లేన్ రోడ్లే. పంచాయతీరాజ్ పరిధిలో ఎక్కువ శాతం మట్టి రోడ్లే ఉండేవి. ఈ పరిస్థితిని ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత  తెలంగాణ ప్రభుత్వం మొదట్లోనే గ్రహించి, రహదారుల అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా గుర్తించిందని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ 32445 కిలోమీటర్ల రహదారులను నిర్వహిస్తోందని, ఇందులో 27461 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు , 4983 కిలోమీటర్ల జాతీయ రహదారులు రాష్ట్రాన్ని దాటుతున్నాయని తెలిపింది. వీటిలో 2682 కిలోమీటర్లు NHAI అభివృద్ధి కోసం మరియు 2301 Km రాష్ట్ర R&B NH నియంత్రణలో ఉన్నాయి. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 2014 నాటికి మొత్తం 24,245 కి.మీ ఆర్ & బి రోడ్ల పొడవులో,కేవలం 27.9% రోడ్డు పొడవు రెండు లేన్లు మరియు అంతకంటే ఎక్కువ వెడల్పుతో వున్నాయి.2014 నుంచి రూ.13030 కోట్లతో 7360 కిలోమీటర్ల పొడవునా రోడ్ల నిర్మాణం,విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో రూ.7526 కోట్ల వ్యయంతో చేపట్టిన 6319 కి.మీ పొడవు పనులు పూర్తయినట్టు తెలిపారు.మిగిలిన 1346 కి.మీ పనులు పురోగతిలో ఉన్నాయి. 2014 నాటికి  6712 కి.మీ రాష్ట్ర రహదారులు 2 లేన్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు డబుల్ లెన్ రాష్ట్ర రహదారుల  పొడవు 12921 కి.మీ. కు పెరిగింది.


2014 లో ఉన్న 669 కి.మీ  వున్న 4 లేన్ ఆర్ & బి రోడ్లు ప్రస్తుతం 1029 కి.మీ కు పెరిగిందని నివేదిక తెలిపింది. గత 8  సంవత్సరాలలో 2 లేన్ పొడవు రోడ్లు దాదాపు రెండింతలు పెరిగింది 4 లేన్ పొడవు రోడ్లు 54% పెరిగింది.రాష్ట్ర రహదారుల పునరుద్ధరణ కింద  రూ.4118 కోట్లతో 13740 కి.మీ పొడవున పనులు చేపట్టగా, ఇందులో 8621 కి.మీ పొడవు పనులు  రూ.2141 కోట్ల వ్యయం తో పూర్తయినట్టు తెలిపారు.రూ. 2650 కోట్ల అంచనాతో చేపట్టిన 519 వంతెనల పునర్నిర్మాణం , వెడల్పు పనులు చేపట్టారు. వాటిలో 1405 కోట్ల విలువైన 391 వంతెనల పనులు పూర్తయ్యాయి. మిగిలిన 125 పనులు పురోగతిలో ఉన్నాయి.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన వంతెనల విషయానికి వస్తే పంచగుడి, బోర్నపల్లి వద్ద గోదావరి నదిపై రెండు వంతెనలు, నీరుకుళ్ల వద్ద మానేర్ నదిపై మూడు వంతెనలు నిర్మాణం జరిగింది.మంథని-ఓడెడ్ రహదారిలో ఖమ్మంపల్లి వద్ద మంజీర నదిపై మూడు వంతెనలు, బీర్కూర్, అన్నసాగర్ - పిట్టం, కామారెడ్డి జిల్లాలోని వెంకంపల్లి వద్ద,గూడెం సమీపంలో ప్రాణహిత నదిపై ఒక వంతెన, సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లి వద్ద కృష్ణా నదిపై ఒక వంతెన నిర్మాణం జరుపుకుంది. వేములవాడ బ్రాంచ్ రోడ్డులో షాబాజ్ పల్లి వద్ద ములవాగు మీదుగా రెండు వంతెనలు పూర్తయ్యాయని నివేదికలో తెలిపారు.హైదరాబాద్ - కరీంనగర్ - రామగుండం రోడ్ లు  NH-563 కలుపుతూ కరీంనగర్ వద్ద మానేర్ నది మీదుగా ఒక హై లెవల్ కేబుల్ స్టీల్ వంతెన చేపట్టబడినది.

Updated Date - 2022-06-26T21:52:42+05:30 IST