జాతీయ రహదారి అధ్వానం

ABN , First Publish Date - 2021-05-06T06:22:38+05:30 IST

వర్షాకాలం వస్తే బురద మయం, ఎండాకాలం వస్తే దుమ్ముతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

జాతీయ రహదారి అధ్వానం
గుంతలుగా ఉన్న రోడ్డు

రోడ్డంతా గుంతలు

దుమ్ముతో ఇబ్బంది పడుతున్న స్థానికులు

కొమరోలు, మే5 : వర్షాకాలం వస్తే బురద మయం, ఎండాకాలం వస్తే దుమ్ముతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని నల్లగుంట్ల గ్రామసమీపంలోని కడప - అమరావతి రాష్ట్రీయ రహదారి అధ్వానంగా మారింది. దారిపొడవునా గుంతలు ఏర్పడ్డాయి. నల్లగుంట్ల గ్రామ సమీపంలో గత సంవత్సరం నుంచి ప్రధాన రహదారి రోడ్డు లేచి గుంతల మయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నో వాహనాలు ఇరుక్కుపోతుండడంతో ఎస్‌ఐ సాంబశివయ్య సొంత నిధులతో మట్టి తోలించారు. అయినా ఫలితం లేదు. ఈ రోడ్డుపై భారీ వాహనాలు తిరుగుతుండడంతో సుమారు 3 అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయి. దీంతో సాయంత్రం అయ్యే సరికి దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు బిందెలతో నీరు తెచ్చి చల్లుకునే పరిస్థితి ఏర్పడింది.  ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గుంతలను పూడ్పించి రోడ్డు ప్యాచ్‌ వర్కులు చేయాలి. దుమ్ము లేవకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-06T06:22:38+05:30 IST