ఏపీలో రూ.21వేల కోట్లతో రహదారుల నిర్మాణం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-17T21:15:59+05:30 IST

ఏపీలో రూ.21వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

ఏపీలో రూ.21వేల కోట్లతో రహదారుల నిర్మాణం: కిషన్‌రెడ్డి

విజయవాడ: ఏపీలో రూ.21వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బెంజిసర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌తో పాటు నిర్మాణం పూర్తయిన పలు జాతీయ రహదారులను ప్రారంభించారు. కొత్తగా నిర్మించే జాతీయ రహదారులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో రూ.60కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కూడా రోడ్లు అత్యంత అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేదని వివరించారు. రోడ్, సముద్ర, వాయు కనెక్టివిటీ చాలా ముఖ్యమన్నారు. శ్రీశైలం, సింహాద్రి, అన్నవరం దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ట్రైబల్ డిపార్ట్‌మెంట్ ద్వారా విశాఖలో అల్లూరి మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విశాఖలో అనేక పరిశ్రమలకు కేంద్రం సహకరిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2022-02-17T21:15:59+05:30 IST