వర్షంలో తారురోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2021-06-23T06:12:51+05:30 IST

216 జాతీయ రహదారి రోడ్డు పనులు ఆధునికీకరణలో భాగంగా ముమ్మిడివరం పట్టణంలో గత రెండ్రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

వర్షంలో తారురోడ్డు నిర్మాణం

ముమ్మిడివరం, జూన్‌ 22: 216 జాతీయ రహదారి రోడ్డు పనులు ఆధునికీకరణలో భాగంగా ముమ్మిడివరం పట్టణంలో గత రెండ్రోజులుగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం తారురోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. అయితే ఆ వర్షంలో కూడా పనులు ఆపకుండా తారురోడ్డు నిర్మాణం సాగించారు. వర్షంలో తారురోడ్డు నిర్మిస్తే నాణ్యత లోపించి రోడ్డు ఎక్కువరోజులు నిలవదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతస్థాయి ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈపనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-06-23T06:12:51+05:30 IST