స్కూలు బస్సును ఢీ కొన్న ఆటో

ABN , First Publish Date - 2021-02-27T05:33:13+05:30 IST

గొల్లప్రోలు, ఫిబ్రవరి 26: స్కూలు బస్సును ఆటో ఢీ కొన్న సంఘటనలో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. తాటిపర్తి సెంటరు నుంచి చెందుర్తి వెళ్తు న్న ప్రైవేటు

స్కూలు బస్సును ఢీ కొన్న ఆటో

ఏడుగురికి స్వల్ప గాయాలు

గొల్లప్రోలు, ఫిబ్రవరి 26: స్కూలు బస్సును ఆటో ఢీ కొన్న సంఘటనలో ఏడుగురికి స్వల్పగాయాలయ్యాయి. తాటిపర్తి సెంటరు నుంచి చెందుర్తి వెళ్తు న్న ప్రైవేటు స్కూలు బస్సును గొల్లప్రోలు నుంచి చేబ్రోలు వైపు వెళ్తున్న టాటా మేజిక్‌ ఢీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు పిఠాపురం ప్రభుత్వాసుపత్రి, స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. గొల్లప్రోలు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2021-02-27T05:33:13+05:30 IST