Abn logo
Mar 2 2021 @ 00:29AM

రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు

జగ్గంపేట రూరల్‌, మార్చి 1: మండలంలోని సీతానగరం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. జగ్గంపేట సీఐ సురే్‌షబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామానికి చెందిన గుణ్ణం దొరబాబు అతడి భార్య టీవిఎస్‌ మోటర్‌సైకిల్‌పై కాట్రావులపల్లి నుంచి జగ్గంపేట వైపు వెళుతుండగా జగ్గంపేట వైపు నుంచి పెద్దాపురం వెళుతున్న ప్రైవేట్‌ బస్సు ఢీ కొనడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సుభాగం కా లికి తగిలి ఒకరి కాలు నుజ్జునుజ్జు అయ్యిందని సీఐ తెలి పారు. సీఐ సురే్‌షబాబు పెద్దాపురం కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాద సంఘటన తెలుసుకుని వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆంబులెన్స్‌ సకాలంలో రాకపోవడంతో సుమారు అర్ధగంట పాటు క్షతగాత్రులు ప్రమాద స్థలంలోనే ఉండిపోయారు. దీంతో సీఐ సురే్‌షబాబు తన వాహనంలోనే క్షతగాత్రులను ఎక్కించి పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. 


Advertisement
Advertisement
Advertisement