రోడ్డు ప్రమాదాల నివేదిక... రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు... * ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి

ABN , First Publish Date - 2022-03-04T22:27:09+05:30 IST

ఈ ఏడాది ప్రారంభంలో(ఫిబ్రవరి 25) జారీ చేసిన నోటిఫికేషన్‌లో... రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే... పోలీసు దర్యాప్తు అధికారి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సంఘటనా స్థలంలోని ఫోటోగ్రాఫ్‌లు/వీడియోలను తీసుకోవాలని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రోడ్డు ప్రమాదాల నివేదిక...   రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు...  * ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి

న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభంలో(ఫిబ్రవరి 25) జారీ చేసిన  నోటిఫికేషన్‌లో... రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే... పోలీసు దర్యాప్తు అధికారి ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సంఘటనా స్థలంలోని ఫోటోగ్రాఫ్‌లు/వీడియోలను తీసుకోవాలని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదం/అందుకు సంబంధించిన వాహనం, లేదా... వాహనాలు, ఘటనా స్థలం తదితర వివరాలను వీడియో రికార్డింగ్‌తో సహా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 


రోడ్డు ప్రమాదాల బాధితుల హక్కుల వివరణను, ఫారం II లో పేర్కొన్న పేర్కొన్న మేరకు ఫ్లో చార్ట్‌ను దర్యాప్తు అధికారి బాధితులకు, లేదా... వారి చట్టపరమైన ప్రతినిధులకు పది రోజుల్లోగా అందజేయాలని రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ, పూర్తిస్థాయి ప్రమాద నివేదిక(డీఏఆర్), మోటారు ద్వారా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారం కోసం, అంతేకాకుండా... సంబంధిత వర్గాల కోసం టైమ్‌లైన్‌లతో పాటు దాని రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరి చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 


వాహన బీమా సర్టిఫికేట్‌లో చెల్లుబాటయ్యే మొబైల్ నంబర్‌లను చేర్చడం కూడా తప్పనిసరి చేసినట్లు నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 1, 2022 నుండి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయ. రోడ్డు ప్రమాదం సమాచారం అందిన వెంటనే... పోలీసు దర్యాప్తు అధికారి... ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాలి, ప్రమాదం జరిగిన ప్రదేశం, ప్రమాదానికి కారణమైన వాహనం/వాహనాలకు సంబంధించిన వాహనం(ల ఫోటోగ్రాఫ్/వీడియోలు తీసుకోవడంతోపాటు ఘటనాస్థలికి సంబంధించిన రికార్డ్‌ను కూడా తీసుకోవాలి. 


గాయాలైన ఘటనలకు సంబంధించి...  దర్యాప్తు అధికారి ఆసుపత్రిలో గాయపడిన వారి ఫోటోలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా... ప్రత్యక్ష సాక్షులు/ప్రేక్షకులను విచారించడం ద్వారా అధికారి ఆకస్మిక విచారణ జరపాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఫారం I లో మొదటి ప్రమాద నివేదిక(ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను సమర్పించడం ద్వారా, ప్రమాదం జరిగిన 48 గంటలలోపు దర్యాప్తు అధికారి...  ప్రమాద వివరాలను క్లెయిమ్‌ల ట్రిబ్యునల్‌కు తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. బీమా పాలసీ వివరాలు అందుబాటులో ఉంటే, సమాచారం ఫారమ్ I లో ప్రమాదానికి బాధ్యులైన, నిబంధనలను ఉల్లంఘించిన వాహనానికి సంబంధించిన బీమా కంపెనీ నోడల్ అధికారికి కూడా నివేదించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-03-04T22:27:09+05:30 IST