రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలే అధికం

ABN , First Publish Date - 2020-09-23T10:15:41+05:30 IST

రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది క్షతగాత్రులు వికలాంగులుగా

రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలే అధికం

సైబరాబాద్‌ పోలీసుల అధ్యయనంలో వెల్లడి


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 22(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది క్షతగాత్రులు వికలాంగులుగా మారుతున్నారు. ఈ ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది పాదచారులే అని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది రహదారి భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించిన సైబరాబాద్‌ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లోకల్‌ రోడ్లల్లో జరిగే ప్రమాదాల్లో అధి క శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతోనే జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో లారీలు, కార్ల తో అధిక ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రతిఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న వారిలో ఒకటి బై మూడో వం తు మంది పాదచారులు ఉంటున్నట్టు పోలీసుల అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నారు. 


వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ..పోలీసుల అధ్యయనంలో గుర్తించిన అంశాలు 

మొత్తం జరిగిన ప్రమాదాలు- 68, మృతి చెందిన వారు- 9, గాయపడిన వారు-74


ప్రమాదాలు.. ఢీకొట్టుకున్న వాహనాలు

బైక్‌- బైక్‌ ఢీకొట్టుకున్న ప్రమాదాలు- 6, బైక్‌- కారు- 1, బైక్‌ - పాదచారులు- 8, బైక్‌- సైకిల్‌ - 1, కారు- బైక్‌--6, ఆటో-బైక్‌--3, లారీ-బైక్‌-4, ఆటో - కారు-2, ఆటో- పాదచారులు-2, కారు- పాదచారులు-2, కారు- కారు-2, బైక్‌- ఇతర వాహనాలు-4, బైక్‌ స్కిడ్‌ అయిన ప్రమాదాలు-3, లారీ- కారు-4, ఇతర వాహనాలు- పాదచారులు-5, బస్సు- కారు-1, బస్సు- పాదచారులు-1, వేరే వాహన ప్రమేయం లేకుండా స్వయం కృతాపరాధంతో జరిగిన వాహన ప్రమాదాలు-18


ప్రమాదాలకు కారణాలు... 

రాష్‌ డ్రైవింగ్‌ వల్ల జరిగిన ప్రమాదాలు-32, అతివేగం - 15, మద్యం మత్తులో డ్రైవింగ్‌-13, అరకొర, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ -7, వాహనాల మధ్య దూరం పాటించకపోవడం వల్ల -7, అపసవ్య దిశలో డ్రైవింగ్‌ -4, నిద్రమత్తులో -3, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాసింగ్‌ -2, రాంగ్‌ పార్కింగ్‌ -2, ట్రిపుల్‌ రైడింగ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, ఓవర్‌టేక్‌ -7.

Updated Date - 2020-09-23T10:15:41+05:30 IST