Abn logo
May 28 2020 @ 09:31AM

నిశ్చితార్థానికి వెళ్తుండగా భార్యాభర్తల దుర్మరణం

Kaakateeya

హైదరాబాద్/పూడూరు : ఆగి ఉన్న బైక్‌ను కారు ఢీ కొనడంతో భార్యాభర్తలు మృతి చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన యగు ఆనంద్‌ (40), భార్య ఉషమ్మ(35) హైదరాబాద్‌ గండిమైసమ్మ వద్ద మేస్ర్తీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం సోమన్‌గూర్తిలో ఉండే ఆనంద్‌ అక్క కూతురి నిశ్చితార్థానికి గండిమైసమ్మ నుంచి బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. సోమన్‌గూర్తి గేట్‌ వద్ద హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై దారి తెలియక ఆగారు. 


ఇంతలో వెనుకనుంచి వచ్చిన కారు వేగంగా బైక్‌ను ఢీకొంది. దీంతో వారు పక్కకు పడిపోయారు. అదే సమయంలో పరిగి నుంచి వస్తున్న మరో కారు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి శ్రీదేవి, అఖిల ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. మృతుడి బావ శ్రీనుసాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ భీమ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement