గుంటూరు: Nagarjuna University వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సెక్రటేరియట్‌కు వెళ్తున్న మంత్రి విడదల రజనీ. ప్రమాద బాధితులను మంత్రి రజనీ పరామర్శించింది. బాధితులను స్వయంగా అంబులెన్స్‌లో ఆసుపత్రికు తరలించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి జీజీహెచ్ సూపరిండెండెంట్కు ఫోన్ చేసి చెప్పింది. గాయాలను వ్యక్తులు ఇద్దరు విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.