Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 07:32:04 IST

పళనికి వెళ్తుండగా ప్రమాదం..

twitter-iconwatsapp-iconfb-icon
పళనికి వెళ్తుండగా ప్రమాదం..

- పాదచారులపైకి దూసుకెళ్లిన కారు

- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం


పెరంబూర్‌(చెన్నై): పాదయాత్రగా వెళుతున్న భక్తులపైకి కారు దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలిలా... దిండుగల్‌ జిల్లా సత్తిరపట్టి పళని రోడ్డులో ఆదివారం రాత్రి కొందరు వ్యక్తులు పాదయాత్రగా పళని ఆలయానికి వెళుతున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తంజావూరు జిల్లా మేలవందచావిడికి చెందిన స్వామినాథన్‌ (49), బంధువు శేఖర్‌ (45) సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, స్వామినాథన్‌ కుమారుడు కమలేష్‌ (9) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన అనంతరం వేగంగా వెళ్లిన కారు సోమవారం ఉదయం పళని సమీపంలో రోడ్డు పక్కన ఆగివున్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిశీలించగా ప్రమాదానికి కారణమైన కారుగా గుర్తించారు. ఈ కారు చెన్నై రిజిస్ట్రేషన్‌తో ‘ప్రెస్‌’ అనే స్టిక్కర్‌ అంటించి ఉంది. ఈ ఘటనపై పళని పోలీసులు కేసు నమోదుచేసి, పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

క్రైమ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.