AP: బైక్ ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-01-06T14:56:30+05:30 IST

గిద్దలూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో బైక్‎ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్...

AP: బైక్ ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్..వ్యక్తి మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో బైక్‎ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న దంపతులలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-06T14:56:30+05:30 IST