Abn logo
Oct 17 2021 @ 09:50AM

ప.గో. జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప.గో. జిల్లా: భీమడోలు మండలం. పాతూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కల్వర్ట్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒక యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి  తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది. తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.