అనంతపురం: జిల్లాలో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. గాండ్లపెంట మండలం ఎర్రపల్లి దగ్గర ప్రమాదవశాత్తు ఆటోబోల్తా పడి లక్ష్మీదేవి అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలపాలైనవారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులని అడిగి విషయం తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మృతురాలి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.