Abn logo
Sep 18 2021 @ 20:01PM

బైక్-ఆటో ఢీ... ఇద్దరు యువకులు మృతి

ప్రకాశం: జిల్లాలోని కందుకూరులోని అలావారి కళ్యాణమండపం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్-ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు రాజోలుపాడుకు చెందిన రాజేష్(17 ), విక్రం(21)గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

క్రైమ్ మరిన్ని...