బెంగళూరు/గంగావతి: కొప్పళ తాలూకా టనకనకల్ వద్ద రోడ్డు ప్రమాదంలో బీజేపీ ఎంపీ కరడి సంగణ్ణ సోదరుడు బసవరాజ (బసణ్ణ) అమరప్ప కరడి (60) మృతి చెందారు. యలమగేరి నుంచి ద్విచక్ర వాహనంపై వెడుతుండగా వేగంగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కేఎస్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతిచెందారు. కొప్పళ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం చోటు చేసుకున్న ఘటనలో ఎంపీ సోదరుడు ఆకస్మికంగా మృతిచెందడంపై పలువురు బీజేపీ నాయకులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి