Abn logo
Mar 2 2021 @ 07:24AM

నెల్లూరులో రెండు కార్లు ఢీ, 11 మందికి గాయాలు

నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా దూసుకువచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన బ్రహ్మణ పల్లి సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలై వారిని దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే... బ్రహ్మణపల్లి కల్వర్టు వద్ద రహదారి భారీగా కుంగిపోవడటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు వద్ద దెబ్బతిన్న రహదారికి వెంటనే మరమ్మతులు చేయాలంటూ..స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement
Advertisement