మద్యం మత్తులో షణ్ముఖ్..

ABN , First Publish Date - 2021-02-28T01:26:45+05:30 IST

నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో

మద్యం మత్తులో షణ్ముఖ్..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. జస్వంత్ ఎక్కువ మోతాదులో మద్యం సేవించాడని పోలీసులు తెలిపారు. అతి వేగంగా కారు నడిపి మూడు వాహనాలను ఢీ కొట్టాడన్నారు. ఈ ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. జస్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్‌ టెస్ట్ చేయగా 170 రీడింగ్ వచ్చింది. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-28T01:26:45+05:30 IST