బంజారాహిల్స్‌‌లో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-03-20T01:27:38+05:30 IST

నగరంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకరు

బంజారాహిల్స్‌‌లో రోడ్డు ప్రమాదం

హైదరాబాద్: నగరంలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఒమేగా ఆసుపత్రి సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వ్యక్తి జీవన్ చెంద్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకున్ని ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.


Updated Date - 2022-03-20T01:27:38+05:30 IST