డివైడర్‌, మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2022-07-25T17:55:05+05:30 IST

మలక్‌పేట నల్గొండ చౌరస్తా నుంచి చాదర్‌ఘాట్‌ వైపు వెళ్తున్న కారు బ్రెక్‌ ఫెయిల్‌ కావడంతో మలక్‌పేట ఆర్‌యూబీ సమీపంలో డివైడర్‌

డివైడర్‌, మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: మలక్‌పేట నల్గొండ చౌరస్తా నుంచి చాదర్‌ఘాట్‌ వైపు వెళ్తున్న కారు బ్రెక్‌ ఫెయిల్‌ కావడంతో మలక్‌పేట ఆర్‌యూబీ సమీపంలో డివైడర్‌, మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఆకస్మాత్తుగా బ్రెక్‌లు ఫెయిల్‌ కావడంతో డివైడర్‌ను, మెట్రో పిల్లర్‌కు ఢీ కొట్టి నిలిచిపోయిందని దిల్‌సుఖ్‌నగర్‌ నివాసి  వి.రాజేంద్రప్రసాద్‌ పోలీసులకు వివరించారు. చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-25T17:55:05+05:30 IST