గుంటూరు: చిలకలూరిపేట తాతపూడి దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఏడుగురు ప్రయాణికులకు గాయాలవగా.. ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.