టైరు ఊడి.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2021-07-25T12:22:24+05:30 IST

కారు టైరు ఊడిపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందకు..

టైరు ఊడి.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు

హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌ : కారు టైరు ఊడిపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చౌటుప్పల్‌ వైపు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు వద్దకు రాగానే వెనుక టైరు ఊడిపోయింది. దాంతో రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది.

Updated Date - 2021-07-25T12:22:24+05:30 IST