Road Accident: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-31T14:20:40+05:30 IST

శివారెడ్డి పేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

Road Accident: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

వికారాబాద్ (Vikarabad): జిల్లాలోని శివారెడ్డి పేట్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొలెరో వాహనం, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో వికారాబాద్‌కు చెందిన తరుణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-31T14:20:40+05:30 IST