Abn logo
Dec 5 2020 @ 00:00AM

ఎక్స్‌వేటర్‌ ఢీకొని యువకుడు మృతి

ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 5 : ఒంగోలు నగరం పేర్నమిట్ట సమీపంలో ఎక్స్‌కవేటర్‌ ఢీ కొని యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. పేర్నమిట్ట గ్రామానికి చెందిన తేళ్ల వంశీ (23), నేలపాటి బాబు బైక్‌పై ఒంగోలు బయలుదేరారు. అయితే కర్నూలురోడ్డులోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాల వద్దకు రాగానే వారు ఎదురుగా వస్తున్న ఎక్స్‌కవేటర్‌ను ఢీకొన్నారు. దీంతో వంశీ అక్కడికక్కడే మరణించాడు. నేలపాటి బాబుకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్‌కు తరలించారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement