Abn logo
Sep 19 2020 @ 07:12AM

తిరుపతి..ఏర్పేడు వద్ద ఆర్టీసీ బస్, లారీ ఢీ

Kaakateeya

తిరుపతి: తిరుపతిలోనిఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ రెండు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు లారీలో చిక్కుకుపోయారు. బస్‎లో ఉన్న ప్రయాణికులలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలబారిన పడిన బాధితులను దగ్గర్లో ఆస్పత్రికి తరలించారు. దీంతో ఏర్పేడులో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‎ను క్లీయర్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement